← Back to news

గంగాపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.. ఎమ్మెల్యే హాజర్!

By Mallikarjuna· 1d ago
గంగాపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.. ఎమ్మెల్యే హాజర్!

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపురం గ్రామంలో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండ గిరి ప్రసాద్ యాదవ్, డిప్యూటీ సర్పంచ్, మండల అధ్యక్షుడు గోపాల్ యాదవ్, సీనియర్ నాయకుడు జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 40m ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.