← Back to news

పరకాల రోడ్డుపై గుంతలు..పట్టించుకోరా అధికారులు?

By prabhakar· 2h ago· Hanumakonda
పరకాల రోడ్డుపై గుంతలు..పట్టించుకోరా అధికారులు?

హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని మెయిన్ రోడ్డుపై భారీ గుంతలు పడి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. వర్షపు నీరు గుంతల్లో నిలవడంతో లోతు తెలీక వాహనదారులు కిందపడి ప్రమాదాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటోందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు శాశ్వత మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

More in Local