పద్మాపురంలో రేపు PGRS కార్యక్రమం

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం పద్మాపురం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) నిర్వహించనున్నట్లు MPDO వీసం ప్రసాద్ తెలిపారు. కలెక్టర్ నిశాంతి టి. ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని MPDO చెప్పారు.



