హుస్సేన్ సాగర్‌లో ఆరేళ్ల పాప.. కాపాడిన ఆటో డ్రైవర్!

TG: హైదరాబాద్‌లో మనసును కలిచివేసే ఘటన జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆరేళ్ల కూతురు రుక్సానాకు ట్రీట్‌మెంట్ చేయించే ఆర్థిక పరిస్థితి బాగోలేక ఆమె తల్లి షబానా.. చిన్నారిని హుస్సేన్ సాగర్‌లోకి విసిరేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనను గమనించిన ఓ ఆటో డ్రైవర్ వెంటనే నీటిలోకి దూకి పాపను కాపాడాడు. తరువాత చిన్నారిని గాంధీ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం రుక్సానా హెల్త్ కండిషన్ స్టేబుల్‌గా ఉందని పోలీసులు తెలిపారు.



