← Back to news

యువతికి వీడియో కాల్‌.. కానిస్టేబుల్‌ మృతి!

By Bala· 1d ago
యువతికి వీడియో కాల్‌.. కానిస్టేబుల్‌ మృతి!

హైదరాబాద్‌ మూసారాంబాగ్‌లోని శాలివాహననగర్‌లో కానిస్టేబుల్‌ ముత్తె చంద్రశేఖర్‌ (35) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌లో రైటర్‌గా పనిచేస్తున్న చంద్రశేఖర్‌ ఆదివారం అర్ధరాత్రి ఓ యువతికి వీడియో కాల్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. యువతి వెంటనే చైతన్యపురి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు మలక్‌పేట పోలీసులకు వివరాలు తెలిపారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

More in Local