PSCMSను అందుబాటులోకి తెచ్చిన విద్యాశాఖ

TG: ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు, అడ్మిషన్లు, విద్యార్థుల భద్రత, వసతుల సమస్యలపై వచ్చే ఫిర్యాదుల నమోదు, పర్యవేక్షణ కోసం తెలంగాణ పాఠశాల విద్యాశాఖ PSCMS(ప్రైవేట్ స్కూల్స్ కంప్లైంట్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) ఆన్‌లైన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఈ చర్యను CCV(COUNCIL FOR CITIZENS VOICE) స్వాగతించింది. ఫిర్యాదులను నిర్ణీత గడువులో విచారించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.


