ఇండియన్ ట్రక్ డ్రైవర్లకు ట్రంప్ ఎసరు !

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస వచ్చిన ట్రక్ డ్రైవర్ల స్థానంలో ఆ దేశ మిలిటరీ వెటరన్స్‌ను (మాజీ సైనికులను) నియమించాలని ప్రతిపాదిం చారు. విదేశీ డ్రైవర్లలో చాలామంది మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమ వుతున్నారని ఆయన ఆరోపించారు. ట్రంప్ చేసిన ఈ ప్రతిపాదన గనుక అమలులోకి వస్తే, అమెరికాలో ట్రకింగ్ రంగంలో ఉన్న దాదాపు 1.5 లక్షల మంది భారతీయులపై, ముఖ్యంగా పంజాబీ, సిక్కు సామాజిక వర్గాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నిర్ణయం వలసదారులను తీవ్రంగా టెన్షన్ పెడుతోంది.


