సిలబస్ మార్పులపై TGPSC స్పష్టత

TG: కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు Telangana Public Service Commission (TGPSC) సిలబస్‌లో మార్పులు చేసేందుకు ఎలాంటి సిలబస్ కమిటీని ఏర్పాటు చేయలేదని కమిషన్ క్లారిటీ ఇచ్చింది. పెద్ద స్థాయిలో సిలబస్ మార్పులు చేయాల్సి వస్తే, వాటిని కనీసం ఏడాది ముందుగానే అభ్యర్థులకు తెలియజేస్తామని స్పష్టం చేసింది. మార్పులు ఉంటే పరీక్ష నోటిఫికేషన్ విడుదల సమయంలోనే చెప్తామని TGPSC కార్యదర్శి తెలిపారు. సిలబస్ మార్పుపై వస్తున్న ప్రచారాలను నమ్మొద్దు అని పేర్కొన్నారు.



