కడపలో టెన్షన్.. కత్తులతో దాడి

AP: ఆంధ్రప్రదేశ్.. కడప జిల్లాలో పరిస్థితులు కంట్రోల్ తప్పాయి. నామినేషన్ కేంద్రాల దగ్గర టెన్షన్ టెన్షన్ ఉంది. కాగితాలపెంట నామినేషన్ కేంద్రం దగ్గర.. వైసీపీ, టీడీపీ శ్రేణులు.. కర్రలు, రాళ్లతో దాడి చేసుకోగా.. ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ దాడిలో 3 వాహనాలు ధ్వంసమయ్యాయి. మరోవైపు మరియాపురం నామినేషన్ కేంద్రం దగ్గర YCP మాజీ డిప్యూటీ మేయర్ కొడుకును గుర్తుతెలియని వారు కత్తితో పొడిచారు. ఈ దాడిలో మురాద్ భాషాతోపాటూ.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.


