← Back to news

నేటి నుంచి శ్రీవారి నవరాత్రి ఉత్సవాలు

By Prashanth· 6h ago
నేటి నుంచి శ్రీవారి నవరాత్రి ఉత్సవాలు

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 20 వరకు జరిగే ఉత్సవాల కోసం గుడిని పూలతో అందంగా అలంకరించారు. నిన్న రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించి, విశ్వక్సేనులవారిని మాడవీధుల్లో ఊరేగించారు. తొలి రోజు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు బంగారు తిరుచ్చి, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు పెద్దశేష వాహన సేవ జరగనుంది. దసరా సెలవులు ఉండటంతో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో TTD విస్తృత ఏర్పాట్లు చేసింది.

More in Current Affairs