జంతర్‌మంతర్‌లో పోలీసులు.. రోజువారీ కూలీలకు అవస్థలు
జంతర్ మంతర్‌లో CJP చేయాలనుకున్న ప్రొటెస్ట్‌ను అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు చేపట్టిన భద్రతా ఏర్పాట్లు, పరిమితులు కార్మికులకు అవస్థలు తెచ్చిపెట్టాయి. రోడ్ల మూసివేత, బండ్ల నిషేధం, చెక్‌పోస్టుల కారణంగా రోజువారీ కూలీలు పనులకు వెళ్లలేకపోయారు. బీహార్‌కు చెందిన నిర్మాణ కార్మికుడు రామ్ కిషన్ మీడియాతో మాట్లాడుతూ “ఉదయం నుంచి రోడ్డు మూసేశారు. బస్సులు, ఆటోలు నిలిచిపోయాయి. పనికి వెళ్లకపోతే ఆ రోజు సంపాదన పూర్తిగా పోతుంది” అని చెప్పారు.



