← Back to news

ఓటర్ లిస్ట్‌లో భగత్ సింగ్ ఫొటో

By Mahesh· 2h ago· Ndtv· Punjab
ఓటర్ లిస్ట్‌లో భగత్ సింగ్ ఫొటో

పంజాబ్‌లోని లూధియానా ఈస్ట్ ఓటర్ లిస్ట్‌లో ఓటరు ఫొటో ప్లేస్‌లో ఫ్రీడమ్ ఫైటర్ భగత్ సింగ్ ఫోటో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ఈ తప్పుపై కాంగ్రెస్ నేత అమరీందర్ సింగ్ రాజా వారింగ్ ప్రశ్నలు లేవనెత్తారు. దీంతో అధికారులు, పాత ఓటర్ లిస్ట్ నుంచి ఈ పొరపాటు జరిగిందని తెలిపారు. ఓటర్ల వివరాలను వెరిఫై చేసే టైమ్‌లో ఈ తప్పును గుర్తించి సరిచేసినట్లు స్పష్టం చేశారు. సరైన ఫోటోలతో ఫైనల్ ఓటర్ లిస్ట్‌ను అక్టోబర్ 12న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఓటర్ లిస్ట్‌లో ఇలాంటి తప్పులు ఎలా జరిగాయనే అంశంపై చర్చ మొదలైంది.

More in Current Affairs