ఆలయ ఆస్తులు దేవుడివే, ప్రభుత్వానివి కావు: సుప్రీంకోర్టు

ఆలయ భూములను ప్రభుత్వ అవసరాల కోసం ఇష్టానుసారంగా తీసుకోలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో ఆలయ భూమికి సంబంధించిన కేసులో భూమిని ప్రభుత్వానికి ఉచితంగా బహుమతిగా బదిలీ చేయడం చట్టవిరుద్ధమని తెలిపింది. ఆలయ భూమిపై నిర్మించిన ప్రభుత్వ కార్యాలయానికి నెలకు ₹31,000 అద్దె చెల్లించాలని, ఆలయానికి ₹1 లక్ష పరిహార ఖర్చులు ఇవ్వాలని ఆదేశించింది. ఆలయ ఆస్తులను కాపాడటం ప్రభుత్వ బాధ్యతే తప్ప, వాటిని సొంతం చేసుకోవడం కాదని తేల్చి చెప్పింది.
