రవితేజ కొడుక్కి మస్త్ ఆటిట్యూడ్ ఉందనుకున్నా- యాదమ్మ రాజు
రవితేజ బ్రదర్ రఘు సన్ మాధవ్ భూపతిరాజు హీరోగా డెబ్యూ చేస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా 'మారెమ్మ'. మంచాల నాగరాజ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కమేడియన్ యాదమ్మ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు కాబట్టి మాధవ్‌కి చాలా ఆటిట్యూడ్ ఉంటుందని అనుకున్నానని, కానీ పరిచయం అయ్యాక అతను చాలా అమాయకుడని అర్థమైందని మాట్లాడారు. సెప్టెంబర్ 10న థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీ గ్రామీణ నేపథ్యంలో సాగే రియల్ ఈవెంట్స్ ఆధారంగా తెరకెక్కబోతోంది.



