ప్రజా సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే జయకృష్ణ

పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం కడగండి గ్రామంలో ప్రజల సమస్యలను పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అడిగి తెలుసుకున్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మాట మంతి’ కార్యక్రమంలో ఆయన పాల్గొని గ్రామస్థులతో నేరుగా మాట్లాడారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు, ప్రజల అవసరాలు, అభివృద్ధి పనులపై వివరాలు సేకరించారు. ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.



