సూపర్ టీచర్..

కేరళలోని కోజికోడ్ ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్ కెమిస్ట్రీ టీచర్ అభిలాష్ తిరువోత్ స్టూడెంట్స్ కోసం ‘రసపెట్టి’ పేరిట ఒక పోర్టబుల్ కెమిస్ట్రీ ల్యాబ్‌ను డిజైన్ చేశారు. క్లాస్‌రూమ్‌లో చాక్ పీసులతో కాకుండా విద్యార్థులకు ప్రాక్టికల్‌గా లైవ్ ఎక్స్‌పెరిమెంట్స్ చూపిస్తేనే కాన్సెప్ట్ బాగా అర్థమవుతుందని ఆయన భావించారు. ల్యాబ్‌కు అవసరమైన బేసిక్ ఎక్విప్‌మెంట్, కెమికల్స్ ఉన్న ఈ బాక్స్‌ను ఏ క్లాస్‌రూమ్‌కైనా ఈజీగా తీసుకెళ్లవచ్చు. ఇలా లైవ్ ప్రయోగాలు చూపిస్తూ విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఇంట్రెస్ట్ పెంచుతున్నారు.



