ఆదివాసీలపై దాడులు ఆపాలని నిరసన

నిర్మల్ జిల్లా పెంబి మండలంలో ఆదివాసీ పశువుల కాపరులపై అటవీ అధికారి దాడి చేశారనే ఆరోపణలతో గిరిజనులు ఆందోళనకు దిగారు. పశువుల మేతకు వెళ్లిన ఇద్దరు ఆదివాసీలను అటవీ అధికారి కొట్టినట్లు ఆరోపిస్తూ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ ఘటనలో శేషారావు తీవ్రంగా గాయపడటంతో ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంబంధిత అటవీ అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ఆదివాసీలపై దాడులను అరికట్టాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.



