గన్నవరం పోలీసులపై NRI మహిళ ఫిర్యాదు
కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులపై అమెరికాలో ఉంటున్న NRI డాక్టర్. వేదాంతం శాంత ఫిర్యాదు చేశారు. కేసరపల్లిలోని సుమారు 3 ఎకరాల భూమి తనదేనని, తన పేరుపై రెవెన్యూ రికార్డులు, పట్టాదారు పాస్‌బుక్‌లు ఉన్నాయని తెలిపారు. భూమి విషయంలో పోలీసులు, ప్రైవేట్ వ్యక్తులు వేధింపులకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. తన హక్కులు కాపాడాలని చంద్రబాబు, మంత్రి లోకేశ్, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావును వేదాంతం శాంత కోరారు.


