మీ పేరుపై క్లెయిమ్ చేయని బ్యాంక్ అకౌంట్ ఉందేమో చెక్ చేశారా?

మీరు లేదా మీ ఫ్యామిలీలో ఎవరైనా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి.. తర్వాత మర్చిపోయారా? ఆ అకౌంట్‌లో ఎంత డబ్బు ఉందేమో తెలుసుకోవాలా? 10 ఏళ్లుగా ఎలాంటి లావాదేవీలు జరగకుండా, క్లెయిమ్ చేయని బ్యాంక్ డిపాజిట్లను ‘Unclaimed Deposits’ అంటారు. ఇలాంటి డబ్బు మీ పేరుపై ఉందో లేదో చెక్ చేసేందుకు <a href="https://udgam.rbi.org.in/unclaimed-deposits/#/login">RBI UDGAM</a> పోర్టల్ ఉంది. పేరు, బ్యాంక్ పేరు, అడ్రస్ లాంటి డీటైల్స్ తో సెర్చ్ చేయొచ్చు. మీ పేరు ఉన్నట్లు అయితే బ్యాంకుకు వెళ్ళి క్లెయిమ్ చేసుకోవచ్చు.



