అదనపు కట్నం వేధింపులు.. భర్త అరెస్ట్

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేటకు చెందిన గెంటే రేణుక ఆత్మహత్య ఘటనలో ఆమె భర్త ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అదనపు కట్నం కోసం భర్త ప్రశాంత్, అత్త కొమురవ్వ, ఆడబిడ్డ పద్మ వేధించారని రేణుక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ కే. రవీందర్ తెలిపారు.


