← Back to news

NET పరీక్షల రద్దుపై విద్యార్థుల బిగ్ ప్రొటెస్ట్

By DK· 20 Aug 2026· హైదరాబాద్
NET పరీక్షల రద్దుపై విద్యార్థుల బిగ్ ప్రొటెస్ట్

TG: UGC-NET పరీక్షల రద్దును నిరసిస్తూ హైదరాబాద్‌లో దిశా స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆందోళనకు పిలుపునిచ్చారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహణ తీరును తప్పుబడుతూ విద్యార్థులు నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పరీక్షలను రద్దు చేయడం ఎన్‌టీఏ వైఫల్యానికి మరో నిదర్శనమని ఆరోపించారు. NTAను రద్దుచేసి, పరీక్షల నిర్వహణలో సమూల మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇవాళ (ఆగస్టు 20న) మధ్యాహ్నం 3గంటలకు హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.

More in TG