🌊 రెగ్యులేటర్లు వచ్చేనా? కూటమి ప్రభుత్వంపైనే ఆశలు!

పశ్చిమగోదావరి జిల్లా కొల్లేరు, ఉప్పుటేరు పరిరక్షణ కోసం 3 చోట్ల రెగ్యులేటర్లు కడతామని 2019లో YCP ఇచ్చిన హామీ నెరవేరలేదు. దాంతో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వమైనా ఈ కలను నిజం చేస్తుందని ప్రజలు, రైతులు వెయిట్ చేస్తున్నారు. సముద్రపు నీరు కలవడం, రొయ్యల చెరువుల వల్ల ఉప్పుటేరు నీరు ఉప్పుగా మారి మత్స్య సంపద పోతోంది. రెగ్యులేటర్లు కడితే ఉప్పు శాతం తగ్గి మత్స్యకారులకు ఉపాధి దొరకడమే కాక, 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.


