← Back to news

జడ్చర్ల MLAకు లక్ష్మారెడ్డి సవాల్

By Surender· 2h ago· Mahabubnagar
జడ్చర్ల MLAకు లక్ష్మారెడ్డి సవాల్

తమపై ల్యాండ్ గ్రాబింగ్ తప్పుడు ఆరోపణలు చేయడం మానాలని MLA జనంపల్లి అనిరుధ్ రెడ్డికి మాజీ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి హితవు పలికారు. జడ్చర్ల అంబేద్కర్ కళాభవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం పవర్‌లో ఉన్నది మీరే కాబట్టి నల్లకుంట, రంగారెడ్డిగూడ ఎండోమెంట్స్, భూదాన్ ల్యాండ్ కబ్జాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇసుక దందా నిజాలు బయటపెట్టాలని, నోటికొచ్చినట్లు మాట్లాడకుండా కబ్జాలు చేసినవి నిరూపించాలని సవాల్ విసిరారు

More in Local