← Back to news

కొహ్లీ సైన్ చేసిన బ్యాట్ విజయ్ చేతిలో... ఫ్యాన్స్ కి పండగే ఇక

By DS· 22 May 2026· Ndtv· tamilanadu
కొహ్లీ సైన్ చేసిన  బ్యాట్ విజయ్ చేతిలో... ఫ్యాన్స్ కి పండగే ఇక

తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు విజయ్‌కు విరాట్ కోహ్లీ ఆటోగ్రాఫ్ చేసిన క్రికెట్ బ్యాట్‌ను MRF ఛైర్మన్ కె.ఎమ్. మామెన్ గిఫ్ట్ చేశారు. రాష్ట్రంలో ₹5,300 కోట్ల గ్రీన్‌ఫీల్డ్ తయారీ ప్లాంట్ ఏర్పాటుపై చర్చించేందుకు వచ్చిన సందర్భంగా ఈ భేటీ జరిగింది. విజయ్ చేతిలో బ్యాట్ ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2008 ఐపీఎల్ తొలి సీజన్‌లో విజయ్ CSK బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరించారు. ఇది చూసిన అటు క్రికెట్ అభిమానులు, విజయ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

More in Politics