"అలా అయితేనే కూటమి".. పవన్ కళ్యాణ్ హెచ్చరిక!
కూటమి బలంగా ఉండాలంటే జనసేన పార్టీ గౌరవానికి ఏ భంగమూ కలగకూడదని ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. స్థానిక ఎన్నికల్లో సీట్ల పంపకం, క్యాడర్ అసంతృప్తి వంటి సమస్యల మధ్య ఈ వ్యాఖ్యలు చేశారు. TDPతో కలిసి అధికారంలో ఉన్నా, జనసేనకు తగిన గుర్తింపు, గౌరవం దక్కకపోతే కూటమి వీక్ అవుతుందని ఆయన సూచించారు. “నీళ్లు అడిగినా ఇవ్వని పరిస్థితి” అంటూ క్యాడర్‌కు జరుగుతున్న అన్యాయాన్ని సూచిస్తూ, ఆత్మగౌరవం కాపాడుకోవాలని అన్నారు. ఇది కూటమి సమన్వయంపై పవన్ హెచ్చరిక లాంటిదే.


