← Back to news

AI డేటా సెంటర్ కోసం.. ముడసర్లోవ సైట్‌!

By Krishna· 8h ago· Instagram

విశాఖలో గూగుల్ డేటా సెంటర్ కోసం సింహాచలం కొండ దగ్గర్లో ముడసర్లోవ సైట్‌ను పూర్తిగా క్లియర్ చేశారని ‘స్టాప్ వైజాగ్ డేటా సెంటర్స్’ ఇన్‌స్టా పోస్ట్ వెల్లడించింది. "AP ప్రభుత్వం సింహాచలం దేవస్థానం భూమి 160 ఎకరాలను.. అదాని, గూగుల్ పార్ట్‌నర్‌షిప్‌తో వచ్చే 15 బిలియన్ డాలర్ల AI హబ్‌కు లీజుకు ఇచ్చింది. ఈ ప్రాజెక్టు వల్ల నీటి వనరులు, పర్యావరణం, వన్యప్రాణుల సంరక్షణపై ఆందోళనలు ఉన్నాయి" అని సిటిజన్లు, పర్యావరణవేత్తలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

More in AP