← Back to news

సిరీస్ రిలీజైన మరుసటి రోజే.. మలయాళ డైరెక్టర్ కన్నుమూత

By Vishi· 2h ago· Onmanorama
సిరీస్ రిలీజైన మరుసటి రోజే.. మలయాళ డైరెక్టర్ కన్నుమూత

మలయాళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. యువ ఫిల్మ్‌మేకర్ బెల్‌రాజ్ కలరిక్కల్ అకస్మాత్తుగా కన్నుమూశారు. ఎర్నాకులంలోని ఒక హోటల్ గదిలో ఆయన మృతిచెందారు. Heart Attack కారణంగా ఆయన మరణించినట్లు తెలుస్తోంది. ఆయన దర్శకత్వం వహించిన కొత్త వెబ్ సిరీస్ ‘కాఫీ స్క్వాడ్’(Kaapi Squad) మొదటి సీజన్ అక్టోబర్ 15న ప్రసారమైంది. ఒక రోజు తర్వాత ఆయన మరణించడం పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. First Print Studios వ్యవస్థాపక సభ్యులలో బెల్‌రాజ్ ఒకరు.

More in Entertainment