4 రాష్ట్రాలపై సుప్రీం సీరియస్!

కృష్ణా జలాల పంపకాలపై AP, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య ఏళ్ల తరబడి సాగుతున్న వివాదాలపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. "మీ మధ్య ఎప్పుడూ ఈ కొట్లాటలేనా?" అంటూ జస్టిస్ విక్రమ్‌నాథ్ త్రిసభ్య ధర్మాసనం ప్రశ్నించింది. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కర్ణాటక ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచకుండా AP ప్రభుత్వం వేసిన అప్పీల్‌పై కోర్టు బుధవారం విచారణ జరిపింది. తమ హక్కులను కర్ణాటక హరిస్తోందని AP వాదించగా, తదుపరి విచారణను కోర్టు నవంబరు 4కు వాయిదా వేసింది.


