← Back to news

ఒడిశాలో జంటపై దాడి.. బీహార్ తరహాలో.!

By Krishna· 5h ago· X

ఒడిశా.. ధేన్‌కనాల్ జిల్లాలోని కపిలాష్ ఆలయానికి బైక్‌పై వెళ్తున్న టూరిస్ట్ కపుల్‌ను కొందరు వ్యక్తులు అడ్డగించి దాడి చేశారు. ఈ ఘటన వీడియోని సోషల్ మీడియాలో చూసిన నెటిజన్లు.. టూరిస్టులకు సెక్యూరిటీ ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు. ఆ జంటపై కొందరు దాడి చేస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా ఉంది. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీహార్‌లో ఇటీవల ఇలాంటి ఘటనే జరిగింది. దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలేవి అనే ప్రశ్నలొస్తున్నాయి.

More in National