← Back to news

వందేభారత్ ఎక్స్ప్రెస్‌కు అగ్నిప్రమాదం

By Bala· 3h ago
వందేభారత్ ఎక్స్ప్రెస్‌కు అగ్నిప్రమాదం

AP: విజయవాడ రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ స్టేషన్‌కు వందేభారత్ రైలు రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు రైలు నుంచి బయటకు పరుగులు తీశారు. వెంటనే రంగంలోకి దిగిన రైల్వే సిబ్బంది మంటలను అదుపు చేశారు. దీంతో గంట సేపు రైలు స్టేషన్‌లోనే ఉండాల్సి వచ్చింది. మంటలు ఎలా అంటుకున్నాయనే దానిపై అధికారులు విచారణ చేపట్టారు.

More in AP