← Back to news

ఎవరీ ముకుల్ చౌదరి ?

By AR· 10 Apr 2026· Telugu Report· Hyderabad
ఎవరీ ముకుల్ చౌదరి ?

ఈడెన్ గార్డెన్స్‌లో నిన్న కోల్ కతా నైట్ రైడెర్స్, లక్నోసూపర్ జెయింట్స్ మధ్య జరిగిన థ్రిల్లర్ మ్యాచ్ లో LSG సాధించిన అద్భుత విజయం వెనుక ఉన్న ఒకే ఒక్కడు ముకుల్ చౌదరి. 104 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఓటమి అంచులో ఉన్న స్థితిలో క్రీజులోకి వచ్చి ముకుల్ అద్భుతం చేశాడు. కేవలం 27 బంతుల్లోనే 54* పరుగులు (7 సిక్సర్లు, 2 ఫోర్లు) బాది, చివరి బంతికి లక్నోని 3 వికెట్ల తేడాతో గెలిపించాడు. రాజస్థాన్ లో ఒక కుగ్రామానికి చెందిన ఈ 21 ఏళ్ల క్రికెటర్ తండ్రి కోరిక మేరకే క్రికెట్ ఆడుతున్నాడు. క్రికెట్ లో రాణించకపోతే గ్రామానికి కూడా రావొద్దని తండ్రి అనడంతో పట్టుదలగా ముకుల్ ఆడాడు. ఫ్లడ్ లైట్ల వెలుగులో ఆడడం అతనికి ఇది రెండోసారి . అయినా ముకుల్ వీరవిహారమైన బ్యాటింగ్ తో ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్ గా మారాడు. ఈ యువ క్రికెటర్ ని రూ. 2.6 కోట్లకు LSG కొనుగోలు చేసింది.

More in Sports