← Back to news

లైంగికదాడి బాధితురాలి అబార్షన్‌కి హైకోర్టు అనుమతి

By Vishi· 2h ago· Deccanherald
లైంగికదాడి బాధితురాలి అబార్షన్‌కి హైకోర్టు అనుమతి

లైంగిక దాడికి గురైన 15 ఏళ్ల బాలిక 30 వారాల గర్భాన్ని అబార్ట్ చేసుకోవడానికి కేరళ హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. లైంగికదాడి వల్ల తన కూతురు గర్భవతి అయ్యిందని, దాన్ని తొలగించేందుకు ఆర్డర్ ఇవ్వాలని బాధితురాలి తల్లి కోర్టును ఆశ్రయించింది. బాలికను పరీక్షించిన మెడికల్ బోర్డు గర్భాన్ని కొనసాగిస్తే బాలిక మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని తెలిపింది. బాధితురాలు, ఆమె తల్లి నుంచి అంగీకారం తీసుకున్న తర్వాత అబార్షన్ పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

More in National