← Back to news

ఇన్‌స్టాలో ప్రేమ పేరుతో మోసం.. ఇండియా వచ్చిన ఇటలీ డిజైనర్

By Vishi· 2h ago
ఇన్‌స్టాలో ప్రేమ పేరుతో మోసం.. ఇండియా వచ్చిన ఇటలీ డిజైనర్

ఇటలీకి చెందిన 50 ఏళ్ల జ్యువెలరీ డిజైనర్ పావోలా బెర్టోలిని సైబర్ వలలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో గురుగ్రామ్‌కు చెందిన ఓ వ్యక్తి తనను తాను ఫ్యాషన్ డిజైనర్‌గా పరిచయం చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. గురుగ్రామ్‌లో బొటిక్ వ్యాపారం పెడదామని చెప్పి, ఆమె నుంచి సుమారు లక్ష రూపాయలకు పైగా తీసుకున్నాడు. ఆ తర్వాత ఫోన్లకు ఆన్సర్ చేయకపోవడంతో తను మోసపోయానని గ్రహించి, సెప్టెంబర్ 28న ఇటలీ నుంచి విమానంలో ఢిల్లీకి చేరుకుని కంప్లైంట్ చేశారు.

More in National