← Back to news

జాతీయ ఆర్చరీ పోటీలకు అల్లూరి క్రీడాకారులు

By B V Appalanaidu· 1d ago· Pathapaderu, Paderu, Alluri Sitharama Raju
జాతీయ ఆర్చరీ పోటీలకు అల్లూరి క్రీడాకారులు

భీమవరంలో జరిగిన రాష్ట్రస్థాయి ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో ITDA పాడేరు అల్లూరి ఆర్చరీ అకాడమీ క్రీడాకారులు సత్తా చాటారు. ఇండియన్ రౌండ్ పురుషుల విభాగంలో సొలగం సాంబశివ స్వర్ణ పతకం, చిట్టపులి మోహిత్ సాయి కాంస్య పతకం సాధించారు. దీంతో వీరు సీనియర్ జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. విజేతలతో పాటు కోచ్ సుధాకర్ నాయుడును ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ సత్కరించారు. జాతీయ స్థాయిలోనూ రాణించి జిల్లాకు, రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

More in Local