వినతి పత్రం అందజేత.. గణనాధుడికి జర్నలిస్టుల రిక్వెస్ట్!

కర్నూలు జిల్లా వెల్లూరిలో ఇంట్రెస్టింగ్ ఈవెంట్. జర్నలిస్టులపై దాడులు జరకుండా చూడాలని APUWJ నాయకులు సోమవారం వడ్డేగేరిలో కొలువైన గణనాధుడికి వినతి పత్రం అందజేశారు. APUWJ మండల అధ్యక్షుడు ఆశ్వర్య మాట్లాడుతూ.. జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలన్నారు. దాడులు చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వినాయకుడిని వేడుకున్నారు. యూనియన్ నాయకులు ఒమేంద్ర, రాజశేఖర్, ఆశోక్, నజీర్ తదితరులు పాల్గొన్నారు. మీ ఊరిలో మట్టి గణపతిని పెట్టారా? అయితే ఈ కింద ఉన్న (+) గుర్తును క్లిక్ చేసి ఫోటో, వార్త పంపండి.


