ఢిల్లీలో NSUI నిరసన.. మోడీ ముఖం ఉన్న దిష్టిబొమ్మ దహనం
దసరా సందర్భంగా ఢిల్లీలో నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(NSUI), యువజన కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. దేశంలో ఎన్నికల ప్రక్రియ, SIR వివాదం, ప్రజాస్వామ్య వ్యవస్థ తీరుతెన్నులపై నిరసనగా ఈ ఆందోళన నిర్వహించారు. ప్రధాని మోడీ ముఖం ఉన్న పోస్టర్‌ను, కొన్ని చోట్ల CEC జ్ఞానేశ్ కుమార్ చిత్రాలను రావణాసురుడి దిష్టిబొమ్మకు తగిలించారు. CEC జ్ఞానేశ్ కుమార్ వెంటనే రిజైన్ చేయాలని NSUI నాయకులు డిమాండ్ చేశారు.



