3,500 మీటర్ల ఎత్తులో హైకోర్టు

లడఖ్‌లోని లేహ్‌లో దేశంలోనే అత్యంత ఎత్తులో ఉన్న హైకోర్టు బెంచ్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అక్టోబర్ 18న ప్రారంభించారు. జమ్మూ కశ్మీర్, లడఖ్ హైకోర్టులో భాగంగా ఈ బెంచ్‌ను ఏర్పాటు చేశారు. సముద్ర మట్టానికి సుమారు 3,500 మీటర్ల ఎత్తులో ఇది ఉంది. అక్టోబర్ 21 నుంచి విచారణలు ప్రారంభం కానున్నాయి. దీంతో లడఖ్ ప్రజలు కేసుల కోసం శ్రీనగర్ లేదా జమ్మూకు వెళ్లాల్సిన అవసరం తగ్గనుంది.



