← Back to news

శాస్త్రీయ ఆలోచనను పెంపొందించుకోవాలి

By NRPT· 1d ago· Bagh Lingampally, Himayatnagar, Hyderabad
శాస్త్రీయ ఆలోచనను పెంపొందించుకోవాలి

హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో SFI ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి విద్యా–వైజ్ఞానిక శిక్షణ తరగతుల్లో ‘మతం–మతోన్మాదం’ అంశంపై క్లాస్ నిర్వహించారు. అక్టోబర్ 12నుంచి 16వరకు జరుగుతున్న తరగతులలో గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు బండారి రవికుమార్ విద్యార్థులకు బోధించారు. మతం పేరుతో విద్వేషాలు, విభజనలు సృష్టించే ధోరణులను అర్థం చేసుకోవాలని సూచించారు. శాస్త్రీయ ఆలోచన, హేతుబద్ధ దృక్పథం, లౌకికవాదం, సమానత్వ విలువలను పెంపొందించుకోవాలని వివరించారు.

More in Local