నేటి నుంచి జిల్లాలో పోలీసు యాక్ట్ అమలు

సంగారెడ్డి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు అక్టోబర్ 1 నుంచి 31వ తేదీ వరకు 30, 30(ఏ) పోలీస్ యాక్ట్-1861 అమల్లో ఉంటుందని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా నిబంధనలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. పోలీస్ అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించకూడన్నారు.



