మాకు పోలీసుల భద్రత కావాలి... గద్వాలలో టీచర్ల భారీ ర్యాలీ

ప్రిన్సిపల్ రూపా రెడ్డి హత్యపై రాష్ర్టమంతా భారీ నిరసనలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన చేపట్టి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. విద్యా సంస్థలకు ప్రత్యేక రక్షణ చట్టం, పాఠశాలల వద్ద డ్రగ్స్ నియంత్రణ, అత్యవసర హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసి ఉపాధ్యాయులకు తక్షణ పోలీసు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.




