120 మంది గర్భిణులకు వైద్య పరీక్షలు

కాకినాడ జిల్లా రౌతులపూడి సామాజిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమం జరిగింది. సుమారు 120 మంది గర్భిణులకు వైద్యులు పరీక్షలు చేసి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించారు. కార్యక్రమంలో డీడీఓ డాక్టర్ బి. సౌమ్య, శిశువైద్య నిపుణుడు డాక్టర్ రఘురామ్, జనరల్ వైద్యుడు డాక్టర్ భరత్, హెడ్ నర్స్ సరస్వతి పాల్గొన్నారు. బుచ్చి సీతయమ్మ మహారాణి బహదూర్ వారి సత్రం ఆధ్వర్యంలో గర్భిణులకు భోజన సదుపాయం కల్పించారు.



