ప్లాస్టిక్ ఇచ్చి బహుమతులు గెలుచుకోండి!

అరకు వ్యాలీలో స్వచ్ఛ దసరా–స్వర్ణ దసరా కార్యక్రమంలో భాగంగా దసరా ధమాకా ఆఫర్ నిర్వహిస్తున్నారు. ఎంపీడీవో వీసం ప్రసాద్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఐదు కిలోల ప్లాస్టిక్, పొడి వ్యర్థాలు అందజేసిన వారికి టోకెన్లు ఇచ్చి అక్టోబర్ 26న MPP office లో లక్కీ డ్రాలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. మొదటి బహుమతిగా ఇండక్షన్ స్టవ్, రెండో బహుమతిగా మిక్సీ, మూడో బహుమతిగా వెండి నాణెం అందజేయనున్నారు.



