← Back to news

ప్రజల సహకారంతోనే శాంతిభద్రతల పరిరక్షణ

By A VIJAY KUMAR· 8h ago· Warangal
ప్రజల సహకారంతోనే శాంతిభద్రతల పరిరక్షణ

వరంగల్ జిల్లా నెక్కొండ పోలీస్‌స్టేషన్‌లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై శ్రవణ్‌కుమార్‌ను బుధవారం గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ రావుల హరీశ్‌రెడ్డి, నెక్కొండ సర్పంచి పెండ్యాల హరిప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజల సహకారం అవసరమని తెలిపారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరిగితే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

More in Local