అధికారుల కోసం వెయిట్ చేయలేదు.. గిరిజనులే బ్రిడ్జి కట్టారు!
AP: అల్లూరి జిల్లా చింతపల్లి మండలం తాజంగిలో గిరిజనుల కష్టాలు మరోసారి బయటపడ్డాయి. బోయపాడు వద్ద గెడ్డపై బ్రిడ్జి లేకపోవడంతో వర్షాలు పడితే లోతుగడ్డ జంక్షన్ నుంచి వనజాజుల, బోయపాడు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా ఆగిపోతున్నాయి. దీంతో గిరిజనులే ముందుకొచ్చి వర్షంలోనూ కర్రలతో టెంపరరీ బ్రిడ్జ్ నిర్మించారు. తమ సమస్యకు పర్మినెంట్ సొల్యూషన్ ఇవ్వాలని, అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మించాలని గిరిజనులు కోరుతున్నారు.


