మద్యం షాపు పెట్టొద్దు.. MLAకు గ్రామస్థుల వినతి

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం చిన్న గురుదాసుపురం జంక్షన్లో మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దని స్థానికులు ఎమ్మెల్యే గౌతు శిరీషను కోరారు. చిన్న గురుదాసుపురం, కొబ్బరి చెట్లూరు, చిన్నమామిడిమెట్టు గ్రామాల యువత, ప్రజలు మంగళవారం ఆమెకు వినతిపత్రం అందజేశారు. మద్యం దుకాణంతో పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, వ్యవసాయ పనులకు వెళ్లే మహిళలకు ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.



