పత్తి పంటపై కోతుల దాడి.. రైతులకు నష్టాలు
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మ గ్రామంలో కోతుల బెడదతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పత్తి పంటలను కోతులు ధ్వంసం చేస్తుండటంతో దిగుబడి తగ్గి నష్టాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెట్టుబడులు, కూలీల ఖర్చులు, సాగునీటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రైతులకు కోతుల బెడద అదనపు భారంగా మారింది. పంటలను కాపాడుకునేందుకు పగలు, రాత్రి తేడా లేకుండా పొలాల వద్ద కాపలా ఉండాల్సి వస్తోందని చెబుతున్నారు.



