దృశ్యం-3 సినిమా చూసి.. తండ్రి హత్యకు ప్లాన్

బిహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో తండ్రి హత్య కేసులో కొడుకుని పోలీసులు అరెస్టు చేశారు. సూరత్‌లో ఉంటున్న 26 ఏళ్ల శివ్‌శంకర్ ‘దృశ్యం-3’ సినిమా చూసి హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. జూలై 26న సూరత్ నుంచి దాదాపు 2 వేల కిలోమీటర్లు ప్రయాణించి గ్రామానికి చేరుకున్న అతడు తండ్రి రఘువీర్ సాహ్నీని హత్య చేసాడు. ఫోన్‌ను స్విచ్‌ఆఫ్ చేసినా, తిరుగు ప్రయాణంలో పటోరి స్టేషన్ వద్ద భార్యకు ఫోన్ చేయడంతో ఆధారం లభించింది. దీంతో అక్టోబర్ 1న అరెస్టు చేశారు.

