సెంట్రల్ జైల్లో 500 ఎకో-ఫ్రెండ్లీ గణేశ్ విగ్రహాల తయారీ
వినాయక చవితి సందర్భంగా రాయ్‌పూర్ సెంట్రల్ జైలు ఖైదీలు 500 ఎకో-ఫ్రెండ్లీ గణేశ్ విగ్రహాలను తయారుచేశారు. సుమారు 10 మంది కలిసి ఈ పనికి పూనుకున్నారు. 1 నుంచి 2 అడుగుల ఎత్తున్న ఈ ప్రతిమలను మట్టి, ఆవుపేడ, ధాన్యం ఊకతో తయారుచేశారు. సేంద్రీయ రంగులు మాత్రమే వాడారు. ప్రతి విగ్రహంలో తులసి, ఇతర మొక్కల విత్తనాలను పొందుపరిచారు. నిమజ్జనం తర్వాత ఈ విత్తనాలు మొలకెత్తి పర్యావరణానికి దోహదం చేస్తాయని జైల్ సూపరింటెండెంట్ యోగేష్ సింగ్ చెప్పారు.
