ఎండిపోతున్న పంటలకు సాగునీరు

ఖమ్మం జిల్లా సత్తుపల్లి MLA మట్టా రాగమయి దయానంద్ ఆదేశాలతో మంగళవారం ఇరిగేషన్ ఆఫీసర్లు సిద్దారం కాలువ లాకులను ఎత్తేశారు. దీంతో సదాశివునిపాలెం నల్లచెరువు, భీమవరం, తుమ్మల చెరువులకు నీళ్లు మళ్లించారు. రేజర్ల లాకులు ఎత్తి బియ్యంకుంట ద్వారా నీటిని అందించారు. ఎండిపోతున్న వరి పంటలకు నీళ్లు అందడంతో రైతులు చాలా హ్యాపీగా ఫీలయ్యారు.




