యోగా టీచర్లపై ఆస్ట్రేలియాలో రచ్చ.. అసలు కథ ఇదే!

ఆస్ట్రేలియా వీసా రూల్స్‌పై ఇప్పుడు యోగా టీచర్ల టాపిక్ వైరల్ అవుతోంది. ఇండియన్ యోగా టీచర్లను ఎక్కువగా తీసుకుంటున్నారనే ప్రచారంపై ఆ దేశ ఇమ్మిగ్రేషన్ మంత్రి టోనీ బర్క్ క్లారిటీ ఇచ్చారు. తమ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క యోగా టీచర్‌ను కూడా ఇండియా నుంచి తీసుకోలేదని చెప్పారు. అయితే 2022లో భారత్‌తో కుదిరిన ఒప్పందం వల్ల అర్హత ఉన్న ఇండియన్ యోగా టీచర్లు, చెఫ్‌లు.. ఇయర్‌కి 1,800 మంది వరకు ఆస్ట్రేలియా వెళ్లే వీలుంది.



